నూతన అతిథిని ఆనందంగా, ఆశ్చర్యంతో, ప్రశంసలతో ఎలా స్వాగతించాలి?
"గర్భ సంస్కారం" అనేది మన పూర్వీకుల నుండి ఒక ప్రాచీన సాంస్కృతిక వారసత్వంగా మనం పొందిన ఆచారం. కానీ అవగాహన లోపం కారణంగా దాని ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ రోజుల్లో, శిశువు యొక్క మానసిక మరియు ప్రవర్తనా వికాసం గర్భంలోనే ప్రారంభమవుతుందని, సరైన గర్భ సంస్కారం ద్వారా దానిని మెరుగుపరచవచ్చనీ శాస్త్రవేత్తలు గుర్తించడంతో, గర్భ సంస్కారం యొక్క ప్రయోజనమూ, ప్రాముఖ్యత ఆధునిక తరం వారు కూడా తిరిగి స్వీకరించారు.
ఇలాంటి పరిస్థితిలో, నేటి కాలానికి అనుగుణంగా, నేటి భాషలో మాట్లాడుతూ, నేటి ఉదాహరణలు ఇస్తూ, సవాళ్లను ఎత్తి చూపుతూ, తల్లిదండ్రులకు సరైన మార్గాన్ని నిర్దేశించే గర్భ సంస్కారంపై ఒక అవగాహన అవసరం. ఈ పుస్తకం సరిగ్గా ఇలాంటి ఉద్దేశ్యంతోనే వ్రాయబడింది. ఇది గర్భ సంస్కారపు ప్రాచీన అవగాహనను, ఆధునిక వాతావరణానికి అనుగుణంగా మార్చి అందిస్తుంది.
ఈ పుస్తకం మనకు ఏమి నేర్పుతుందంటే
మిమ్మల్ని మీరే కాక, మీ కడుపులోని బిడ్డను కూడా భావోద్వేగపరంగా, మానసికంగా మరియు శారీరకంగా ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ఇంకా ఆ శిశువును ఒక పుణ్యాత్ముడైన సాధు