सैर कर दुनिया की ग़ाफिल, जिंदगानी फिर कहा, (సైర్ కర్ దునియా కి గాఫిల్, జిందగీ ఫిర్ కహా)
जिंदगी अगर कुछ रही तो, नौजवानी फिर कहा । (జిందగీ అగర్ కుచ్ రహీ తో నవ్ జవాని ఫిర్ కహ)
'జీవితం దుర్లభం కాబట్టి ప్రపంచ పర్యటన చెయ్యి, ఒకవేళ జీవితం ఉన్నా ఈ యవ్వనం మళ్ళీ రాదు' అన్న మాటలు ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ మనసు పై చెరగని ముద్రను వేశాయి. అందుకే ఈ రచయిత తన జీవితంలో యవ్వన కాలాన్నంతా 33 ఏళ్లు ప్రపంచ పర్యటనలోనే గడిపేశారనడానికి ఆయన అక్షరీకరించిన యాత్రా సంస్మరణలే సాక్ష్యం.
అనేక మంది విదేశీయులు మన దేశానికి, మన దేశం నుండి అనేక మంది పర్యాటకులు ఇతర దేశాలకు యాత్రలు చేసి ఆ పర్యటనల విశేషాలను సాహిత్య రూపంలో పాఠకులకు అందించిన వారి నిబద్ధతను ప్రశంసించాల్సిందే.
తెలుగులో ఈ యాత్రా సాహిత్యానికి అనేక మంది సాహిత్యకారులు ఏనుగుల వీరాస్వామయ్య 'కాశీ యాత్ర చరిత్ర' (1838) దగ్గర నుండి మొదలుకుని జానీ తక్కెడ శిల 'మట్టినై పోతాను' (2019) వరకు అనేక యాత్ర చరిత్రలు సాహిత్య రూపంలోకి మలచబడ్డాయి.
ఈ "సమ్మోహనం యాత్రాన్వేషణా సవ్వడులు" పాఠకులని ఉత్తర, దక్షిణ భారత దేశ యాత్రలే కాకుండా విదేశీ యాత్రా పర్యటనలు కూడా చేయిస్తుij