ఒక పదేండ్ల క్రింద రావలసిన పుస్తకం ఇది. ఇందులోని వ్యాసాల్లో సగం దశాబ్ధం క్రిందటనే రాసినవి. ఇటీవల నాలుగైదు నెలల నుండి రాసినవి మరి సగం. ఈ పుస్తకం తీసుకరావడానికి అక్టోబర్ 2022 నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను,రాస్తూనే ఉన్నాను. రాస్తున్న కొద్దీ రచనల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇలా ఈ 2023 జనవరి చివరి వారంలో ముద్రణకు వెళ్తుంది. కాలం చాలా గొప్పది కొన్ని మంచి రచనలు చదువుకునే భాగ్యాన్ని అవకాశాన్ని కూడా ఇచ్చింది. అలా యాదృచ్ఛికంగా రాసిందే విశ్వనాథ వారి 'మ్రోయు తుమ్మెద'. అది మా కరీంనగర్ పట్టణానికి చెందిన గొప్ప సంగీతకారుడు పి.నారాయణరావు గారిపై విశ్వనాథవారు రాసిన మహత్తర నవల. శిథిలమైన దశలో ఉన్న ఆ నవలను మిత్రుడు సంకేపల్లి నాగేంద్రశర్మ ద్వారా సాహితీమిత్రులు జి.వి. కృష్ణమూర్తి గారి ఇంటి నుండి సంపాదించి, చదివి వ్యాసం వ్రాసాను.ఆ నవలపై ఎంతో తృప్తి కలిగింది ఆ వ్యాసం రాసినందులకు కరీంనగర్ గడ్డపై పుట్టినవాడిని కనుక. గురజాడ 150వ జయంతికి విజయనగరం వెళ్లి వచ్చాను, గురజాడ ఇంటిని దర్శించి వచ్చాను.ఆ సందర్భంగా రాసిందే గురజాడ పై వ్యాసం. రాజమండ్రి వెళితే కందుకూరి ఇంటిని సందర్శించిన అనుభూతి గొప్పది. ఆ మహానుభావుడి సంపూర్