బాల్యం మంచితనానికి, అమాయకత్వానికి, చీకు చింతలు లేని జీవితానికి నిలయం. ఆ దశలో బాలలు మానసికోల్లాసంతో ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. అది ఆ దశ ప్రత్యేకత. అది ఒక తీపి జ్ఞాపకం. బాల్యానికి సంబంధించిన సాహిత్యం బాల సాహిత్యం. ఈ సాహిత్యాన్ని బాల సాహిత్యం, బాల వాజ్ఞ్మయం, పిల్లల సాహిత్యం, శిశు సాహిత్యం అనే పదాలతో పిలుస్తుంటారు. బాల సాహిత్యానికి నాంది అమ్మ హృదయం. ఆమె నెలబాలను ఊయలలో ఊపుతూ ఏదో ఒక కూనిరాగం తీస్తూనో లాలిపాట పాడుతూనో బాలను నిద్రపుచ్చుతుంది. ఆ అమ్మ కంఠస్వరం వింటూ, అమ్మ ముఖం చూస్తూ అనుభవించే ఆనందమే ఆ బాల లక్ష్యం. ఇది బాలసాహిత్య ప్రారంభ దశ. ఈ దశలో బాలలు తన్మయంతో, తాదాత్మ్యం చెందడం దీని ప్రత్యేకత.
ఈనాడు సంఘంలో జరిగే ఎన్నో దుర్మార్గ, అసాంఘిక చర్యలను గమనిస్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు కావున భవిష్యత్ లో అనైతిక ప్రవర్తనలు బాలల మనస్సులో ప్రభావితం కాకుండా ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకే బాల సాహితీ క్షేత్రంలో నా వంతుగా చిరు దీపమెత్తాను. ఆ ఉద్దేశ్యంతోనే 12-15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలకు ఈ సాహితీ రచనలు చేస్తున్నాను. నా కథా రచన పద్ధతి ఒక్కో చోట ఉపన్యాస పద్ధతిగాను, మరి కొన్నిచ