వీలునామా రాయాలంటే ఆస్తి ఉండాలి.
"మీ ఆస్తి ఏమిటి?" అని అడిగితే ఇల్లు, డబ్బు, దస్కం కాదు. నేను పంచిపెట్టబోయే ఆస్తి అవేవీ కావు.
నా జీవితంలో సంపాదించుకున్న అనుబంధాలు... కొందరితో గడిపిన క్షణాలు... వాళ్ల గురించి నేను రాసుకున్న అక్షరాలు... ఇవే నా ఆస్తి. ఇది నా స్వార్జితం.
ఈ ఆస్తిని బ్యాంకులో దాచలేదు. లాకర్]లో పెట్టలేదు. వారసత్వంగా ఎవరి పేరునా రిజిస్టర్ చేయలేను. అందుకే నాతోపాటే మాయమైపోకూడదనే కోరికతో అక్షరాల్లో దాచుకున్నాను.
ఈ పుస్తకంలోని వ్యాసాల్లో నా అమ్మా, నాన్నగార్లకు ప్రత్యేక స్థానం ఉంది. మిగిలినవన్నీ నా జీవితంలో పరిచయమైన మిత్రులు, కళాకారులు, సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, ఇంకా నా జీవితంపై చెరగని ముద్ర వేసిన సాధారణ మనుషుల గురించి.
సిరివెన్నెల, కె. విశ్వనాథ్ వంటి ప్రముఖుల నుంచి, పరిచయంగా మొదలై అనుబంధంగా మారిన మనుషుల వరకు-ప్రతి వ్యాసం వెనుక ఒక మనిషి, ఒక అనుభవం, ఒక జ్ఞాపకం ఉంది.
అందుకే వీటిని కేవలం వ్యాసాలుగా చూడలేను. ఇవి నేను సంపాదించుకున్న జీవితపు ఆస్తి. బహుశా... సంచిత కర్మ
ఇంత ఆస్తిని నా దగ్గరే దాచుకోవడం ఎందుకు?
అందుకే ఈ 'వీలునామా' ద్వారా మీ అందరికీ పంచిపెడుతున్నాను.
ఎవరికి ఎంత దక్కాలో నేన